ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భద్రాద్రి రామయ్య కల్యాణానికి... కోటి తలంబ్రాల దీక్ష - talambralu for bhadradri ramaiah kalyanotsavam

భద్రాచలం సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచే తలంబ్రాల ప్రక్రియ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురంలో ఒక ఎకరం విస్తీర్ణంలో ధాన్యాన్ని పండించి, అదే ధాన్యాన్ని గోటితో వలిచి, సీతారాముల కల్యాణానికి అందిస్తామని మహిళలు వెల్లడించారు.

one crore talambralu for bhadradri ramaiah kalyanotsavam
భద్రాద్రి రామయ్య కల్యాణానికి కోటి తలంబ్రాల దీక్ష

By

Published : Mar 29, 2021, 7:11 PM IST

భద్రాద్రి రాముల వారి కల్యాణానికి మేము సైతం అంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళలు కోటి తలంబ్రాల దీక్ష చేపట్టి ధాన్యం ఒలుస్తున్నారు. కోరుకొండలోని శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో... 2012 నుంచి భద్రాద్రి రాముల వారి కల్యాణానికి గోటితో ధాన్యం ఒలిచి తలంబ్రాలు అందిస్తున్నారు. ఈ ఏడాదితో దశమ కోటి తలంబ్రాల దీక్ష అవుతుందని సంఘం అధ్యక్షులు కల్యాణం అప్పారావు తెలిపారు.

భద్రాద్రి సీతారామ కల్యాణంతోపాటు ఒంటిమిట్టలోని రాములవారి కల్యాణానికీ కోటి తలంబ్రాలు అందజేస్తున్నామని అప్పారావు అన్నారు. భద్రాద్రి రామయ్య తలంబ్రాల కోసం గోకవరం మండలం అచ్యుతాపురంలో ఒక ఎకరం విస్తీర్ణంలో ధాన్యాన్ని పండించి, అదే ధాన్యాన్ని గోటితో వలిచి, సీతారాముల కల్యాణానికి అందిస్తామని వెల్లడించారు.

ఇదీచదవండి.

తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దే: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details