జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో శని, ఆదివారాల్లో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ఓ హోటల్లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటలకు ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద మన నది మన నుడి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. నది పరిరక్షణకు సంబంధించి చిన్నారులతో రచ్చబండ నిర్వహిస్తారు. గోదావరికి హారతిని ఇస్తారు. ఆదివారం హోటల్లో మన నుడి కార్యక్రమంలో పాల్గొని కవులు, రచయితలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
రేపు జనసే పార్టీ ఆవిర్భానదినోత్సవం.. జిల్లాకు పవన్ రాక! - pawan kalyan latest news and shedule for today
జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు పవన్ రానున్నారు. మన నది-మన నుడి అనే కార్యక్రమాన్ని ధవళేశ్వరం రామపాదాల రేవులో ప్రారంభిస్తారని పార్టీనేత కందుల దుర్గేష్ వెల్లడించారు.
ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న జనసేన నేతలు