కరోనా వైరస్ సోకినవారిపట్ల వివక్షత చూపొద్దని పిఠాపురంలోని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డా.ఒమర్ అలీషా ఉద్ఘాటించారు. గురువారం అంతర్జాలంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు.
మానసికంగా, శారీకరంగా కుంగిపోయినవారి పట్ల వివక్షత చూపితే వారిపై మరింత ఒత్తిడి పెరిగి అనారోగ్యపరమైన సమస్యలు ఏర్పడతాయన్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపడానికి ప్రయత్నించడం భగవంతుని సేవతో సమానమని అన్నారు.