తూర్పుగోదావరి జిల్లా రాజోలులో భవనం పైకప్పు కూలి వృద్ధురాలు మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో నాగరత్నం అనే 79 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. శుక్రవారం రాత్రి గదిలో పడుకున్న ఆమెపై కప్పు కూలింది. ఈ ఘటనలో ఆమె మరణించింది.
ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్లాబ్ పెళ్లల కింద నాగరత్నం మృతదేహాన్ని గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులు గల్ఫ్‌లో నివాసముంటున్నారు.