ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృద్ధుడు మృతి.. పాము కాటుతోనా? వరద నీటిలో మునిగా? - బొమ్మరాల్లతిప్పలో వృద్ధుడు మృతి

తూర్పు గోదావరి జిల్లా బొమ్మరాలతిప్పకు చెందిన మర్రి గోవిందు అనే వ్యక్తి మంగళవారం రాత్రి మరణించాడు. అతను పాము కాటుతో చనిపోయాడా.. వరద నీటిలో మునిగి మృతి చెందాడా అన్నది తేలాల్సి ఉంది. అతని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసపత్రికి తరలించారు.

old man died in east godavari district
వృద్ధుడు మృతి

By

Published : Aug 19, 2020, 7:19 PM IST

తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం శివారు బొమ్మరాలతిప్పకు చెందిన మర్రి గోవిందు అనే వ్యక్తి మంగళవారం రాత్రి మరణించాడు. పాము కాటుతో చనిపోయాడని కొందరు, వరద నీటిలో మునిగిపోయాడని కొందరు తెలిపారు.

అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం ఆయన మరణానికి కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details