తమ కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిందనీ.. తనకు వస్తుందేమోననే భయంతో 82 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో జరిగింది. వాడపాలెంలో ఉంటున్న బండారు సత్యవతి అనే 82 ఏళ్ల వృద్ధురాలు కరోనా భయంతో ముక్తేశ్వరం పంట కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. వృద్ధురాలి మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్థరించారు.
కొవిడ్ భయంతో.. 82 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య - vadapalem old lady suicide
కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిందని ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది. తనకూ సోకుతుందేమోనన్న అనుమానంతో పంట కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో ఆమెకు కరోనా సోకలేదని తేలింది.
వృద్ధురాలు ఆత్మహత్య