తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం కేసనపల్లిలో ప్రమాదవశాత్తు ఓఎన్జీసీ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గొల్లపాలెం ఓఎన్జీసీ వెస్ట్ స్ట్రక్చర్ బావి నుంచి తాటిపాక రిఫైనరీకీ ముడి చమురు తరలిస్తున్న ట్యాంకర్.. కేసనపల్లిలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది.
ఆయిల్ ట్యాంకర్ నుంచి ముడిచమురు లీక్ అవ్వడం గమనించిన.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సంఘటనా స్థలానికి మలికిపురం ఎస్సై నాగరాజు, ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.