ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అడవి జంతువులకు ఆహారం వేస్తే ఎంతో ప్రమాదం' - తూర్పు గోదావరిలో జంతువుల పరిస్థితి

రోడ్లపై కోతులకు ఆహారం వేయవద్దని తూర్పుగోదావరి జిల్లా మల్లిసాల ప్రాంత ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాస్ సూచించారు. కోతుల ద్వారా అడవి జంతువులకు కరోనా వ్యాపించే అవకాశముందన్నారు.

animals situation during lock down
జంతువుల ఆహారంపై నిపుణులు

By

Published : Apr 20, 2020, 5:11 PM IST

అడవిలో జంతువులకు ఎలాంటి ఆహారం అందించవద్దని తూర్పుగోదావరి జిల్లా మల్లిసాల ప్రాంత ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాస్ అన్నారు. జగ్గంపేట నుంచి గోకవరం వెళ్లే రహదారిపై కోతులకు, పశువులకు ఆహారం వేస్తున్నారని... అలా వేయవద్దని కోరారు. వైరస్​ కోతుల ద్వారా ఇతర జంతువులకు వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందన్నారు. కోతులు గ్రామాల్లోకి వచ్చి ఇంకా వ్యాపింపజేస్తాయన్నారు. రోడ్లపై ఆహారం వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details