ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు - mummidivaram election news

తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.

officials inspecting polling arrangements
పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

By

Published : Mar 9, 2021, 5:47 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.

ముమ్మిడివరం

ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్ పరిశీలించారు. ఒక వార్డ్ ఏకగ్రీవం కాగా 19 వార్డులో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. స్థానిక బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్.. కౌంటింగ్ సెంటర్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి.. చేయాల్సిన మార్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

అమలాపురం

అమలాపురం మున్సిపాలిటీలో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. 330 మంది సిబ్బందిని నియమించామని మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు తెలిపారు. ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 24 వార్డులకు గాను 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ చదవండి:ఓటు వివరాలు తెలుసుకునేందుకు.. ఫ్లెక్సీ ఏర్పాటు!

ABOUT THE AUTHOR

...view details