కరోనా వ్యాప్తి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో శని, ఆదివారాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉదయం కాసేపు రైతు బజార్, నిత్యావసర దుకాణాలు తెరుస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో అధికారులు చర్చించి దుకాణాలు, రైతు బజార్లు సైతం శని, ఆదివారాల్లో తెరవకుండా పూర్తిగా లాక్డౌన్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజలు దీనికి సహకరించాలని అధికారులు కోరారు.
వారాంతంలో నిత్యావసర దుకాణాలు సైతం బంద్
లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని పట్టణాల్లో ఉదయం కొంతసేపు నిత్యావసర దుకాణాలు, కూరగాయల మార్కెట్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలోని తునిలో శని, ఆదివారాల్లో వీటిని సైతం మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
Officials have decided to conduct a full lockdown in Tuni on Sunday and Saturday