తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గిరి ప్రదక్షిణ రద్దు చేసి, కొండపై ప్రాకార సేవ మాత్రమే చేపట్టనున్నారు. దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్, ఈవో త్రినాథరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని చర్చించారు.
రానున్న కార్తీక మాసం ఉత్సవ నిర్వహణపై అధికారుల చర్చ - east godavari dist latest news
అన్నవరంలో ఆ ఏడాది కార్తీక మాసం ఉత్సవాలను నిరాడంబరంగా చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా గిరి ప్రదక్షిణ రద్దు చేసి, కొండపై ప్రాకార సేవ మాత్రమే చేపట్టనున్నారు.
రానున్న కార్తీక మాసం ఉత్సవ నిర్వహణపై అధికారుల చర్చ
ఈ నెల 30న కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపై ప్రధానాలయం చుట్టూ స్వామి, అమ్మవార్లకు ప్రాకార సేవ శాస్త్రోక్తంగా చేయాలని నిర్ణయించారు. 26న కార్తీక శుద్ధ ద్వాదశి రోజు స్వామి వారి నౌక విహార మహోత్సవం నిరాడంబరంగా చేయనున్నారు. ప్రతి ఏటా సుందరంగా తీర్చిదిద్దే హంస వాహనం బదులు చిన్న బోటును అలంకరించి స్వామి, అమ్మవార్లను పంపా సరోవరంలో ఊరేగిస్తారు.
ఇదీ చదవండి: 'పుష్ప' కోసం.. మారేడిమిల్లి చేరుకున్న హీరో అల్లు అర్జున్