ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటర్లకు స్వాగతం.. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు

అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించినట్లే.. ఎన్నికల నిర్వహణ అధికారులు ఓటర్లను ఆకర్షించి.. నూరు శాతం ఓటింగ్ జరిగేలా చూడడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఓటర్లకు పచ్చటి తివాచీతో స్వాగతం పలికేందుకు.. కేంద్ర పాలిత యానం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ చేసిన ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Officials arrangments for the conduct of elections
ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు

By

Published : Apr 5, 2021, 2:06 PM IST

యానాంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో నూరు శాతం ఓటింగ్‌ జరిపించాలనే లక్ష్యంతో .. యానాం రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధాన కూడలిలో మోడల్ పోలింగ్ ఏర్పాటు చేసి ఓటర్లకు అందించే సేవలు తెలిసేలా ఫ్లెక్సీలు పెట్టారు. 60 కేంద్రాల్లో రెండింటిని మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేశారు.

అందరికీ అనుకూలంగా..

అందులో.. సమాచార కేంద్రం, వృద్ధులు, వికలాంగులు వేచి ఉండేందుకు ప్రత్యేక గదులు, ఓటరు.. లోపలున్న బ్యాలెట్‌ పెట్టే దగ్గరకు వెళ్లే వరకూ పచ్చని తివాచీలు పరిచారు. కొవిడ్ దృష్ట్యా ప్రతీ కేంద్రం వద్ద శానిటైజర్లు, మాస్క్‌లను సిద్ధంగా ఉంచారు.

ఇవీ చూడండి...:తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల కవాతు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details