ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారులే బకాయిలు ఇప్పించాలి : అవుట్ సోర్సింగ్ సిబ్బంది

వేతన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ వద్ద అవుట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. ప్రాణాలకు తెగించి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నా.. మూడు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులే బకాయిలు ఇప్పించాలి : అవుట్ సోర్సింగ్ సిబ్బంది
అధికారులే బకాయిలు ఇప్పించాలి : అవుట్ సోర్సింగ్ సిబ్బంది

By

Published : Oct 23, 2020, 9:24 PM IST

బకాయి పడ్డ వేతనాలు తక్షణమే చెల్లించాలంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ వద్ద మెడికల్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ప్రాణాలకు తెగించి ప్రజలకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నా.. మూడు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదని మండిపడ్డారు.

వీరా తరఫున విధులు...

వీరా కాంట్రాక్ట్ సంస్థ ద్వారా తాము విధులు నిర్వహిస్తున్నామని.. వేతనాలు అడిగితే యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు తక్షణమే వేతనాలు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : ఏపీ పీజీ ఈసెట్- 2020 ఫలితాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details