ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్​కు స్పందన... బుడుగువానిలంకకు పడవలు - godavari river floods

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బుడుగువానిలంక గ్రామాన్ని వరద గోదావరి చుట్టిముట్టింది. వరద నీరు ఊర్లోకి రావడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితిపై ఈటీవీ భారత్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామస్థుల రాకపోకలకు పడవలు ఏర్పాటు చేశారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందన...బుడుగువానిలంకకు పడవలు ఏర్పాటు
ఈటీవీ భారత్ కథనానికి స్పందన...బుడుగువానిలంకకు పడవలు ఏర్పాటు

By

Published : Aug 17, 2020, 9:41 PM IST

గోదావరి వరదనీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టింది. యేటిగట్టు లోపల గ్రామం ఉన్న కారణంగా.. వరద నీరు ఊరిలోకి వచ్చింది.

రాకపోకలకు ఇబ్బందులు పడుతుండడం, గ్రామస్థులు నడుము లోతులో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిపై ఈటీవీ భారత్‌, ఈటీవీ కథనాలు ప్రసారం చేసింది. అధికారులు స్పందించారు. బాధితులు వరద నీటిని దాటేందుకు పడవలు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details