తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పరిధిలోని అనేక లంక గ్రామాల్లోని పాడి ఇతర పశువులను ఏటి గట్లపైకి చేర్చి కాపాడుకున్నా వాటికి దాణా అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. వేల సంఖ్యలో ఉన్న పశువులకు అధికారులు అంతంతమాత్రంగా ఎండుగడ్డిని అందించారని రైతులు తెలిపారు. పశుపోషణ పాల అమ్మకం ద్వారానే జీవనం సాగించే పాడి రైతుల కష్టాలను ఈటీవీ భారత్లో వచ్చిన కథనం ద్వారా తెలుసుకున్న రాష్ట్ర రైతు సంఘం నాయకులు.. లంక గ్రామాల్లో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని.. పశువుల అన్నింటికీ సరిపడా దాణా అందించేలా ఏర్పాట్లు చేస్తామని రైతు సంఘ నాయకులు తెలిపారు.
'ఈటీవీ భారత్' పశుఘోష కథనానికి స్పందన - latest news of east godavari dst animals news
వరదల ప్రభావంతో గోదావరి జిల్లాలోని లంక గ్రామాల పాడి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది. పశు ఘోష కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. లంకగ్రామాల్లో పర్యటించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రైతుసంఘం నాయకులు హామీ ఇచ్చారు.
officers respond to etv bharath animals problems story in east godavari dst
TAGGED:
east godavari dst taja news