ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

covid vaccination: రికార్డుల్లోనే కొవిడ్ వ్యాక్సినేషన్.. ఇవ్వకున్నా ఇచ్చినట్టు నమోదు!

కొవిడ్‌ టీకా రెండో డోసు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లుగా రికార్డుల్లో రాసేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 మంది వైద్యాధికారులకు ఆ జిల్లా వైద్యారోగ్యశాఖ శనివారం నోటీసులు జారీ చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వైద్యారోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రికార్డుల్లోనే కొవిడ్ వ్యాక్సినేషన్
రికార్డుల్లోనే కొవిడ్ వ్యాక్సినేషన్

By

Published : Oct 17, 2021, 8:25 AM IST

కొవిడ్‌ టీకా రెండో డోసు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లుగా రికార్డుల్లో రాసేస్తున్నారు! తూర్పుగోదావరి జిల్లాలో 17 మంది వైద్యాధికారులకు ఆ జిల్లా వైద్యారోగ్య శాఖ శనివారం నోటీసులు జారీ చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ముందు రోజు నమోదు చేసిన వివరాల ఆధారంగా పలువురికి ఫోన్లు చేసి టీకా వేయించుకున్నారా? లేదా? అని వైద్యారోగ్య శాఖ అధికారులు ఫోన్లలో సంప్రదించగా... కొందరు తీసుకోలేదని సమాధానమిచ్చారు.

తూర్పుగోదావరితోపాటు కర్నూలు, పశ్చిమగోదావరి తదితర జిల్లాల్లో 10% నుంచి 30% వరకు టీకా ఇవ్వకపోయినా... ఇచ్చినట్లుగా రాసినట్లు తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా టీకాల అధికారిణి డాక్టర్‌ భారతీలక్ష్మి, ఏలేశ్వరం, శంఖవరం, సీతానగరం, కాట్రేనికోన తదితర 17 పీహెచ్‌సీల వైద్యాధికారులకు సంజాయిషీ నోటీసులిచ్చారు.

రాష్ట్రంలో కొన్నిచోట్ల టీకా తొలిడోసు పొందిన వారు.. రెండోది వేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. వ్యక్తిగత కారణాలు, సమాచార లోపం వంటి అంశాలతో వీరు వెనకడుగేస్తున్నారు. కొందరు వేర్వేరు మార్గాల్లో అప్పటికే రెండో డోసు తీసుకోవడంతో స్పందించడం లేదు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయాలన్న జిల్లా అధికారుల ఆదేశాలను అమలు చేసినట్లుగా చూపేందుకు కొందరు రికార్డుల్లో వివరాలను తప్పుగా నమోదు చేస్తున్నారు.

ఇలాంటి వాటిని వైద్యారోగ్య శాఖ స్వయంగా పసిగట్టింది. వ్యాక్సిన్‌ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో టీకా అధికారికంగా ఉపయోగంలేకుండా పోతోంది. మరోవైపు కడప జిల్లాలో ఓ వివాహిత రెండో డోసు తీసుకోకున్నా... ఇచ్చినట్లు ఆమెకు సందేశం వచ్చింది. ఆమె తొలి డోసు పొందిన ప్రాంతంలో కాకుండా ఇంకోచోట వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సమాచారం వచ్చింది. ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, జేసీలు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఇదీ చదవండి:

krmb:కేఆర్‌ఎంబీ పరిధిలోకి.. శ్రీశైలం, సాగర్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు

ABOUT THE AUTHOR

...view details