కరోనా మహమ్మారి విజృంభణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో గడిచిన ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన శుభకార్యాలు ఎట్టకేలకు మొదలవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదు కావడంతో.. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోనూ వివాహ, శుభకార్యాల నిర్వహణపై అధికారులు ఆంక్షలు విధించారు. గత నెలలోనే నిబంధనలు సవరించి పలు కార్యక్రమాలకు అనుమతి ఇచ్చినప్పటికీ యానాంలో మాత్రం శుభకార్యాలు నిర్వహణకు అనుమతి నిరాకరించారు. దసరా అనంతరం ముహూర్తాలు ఉండటం.. వివాహాలు జరిపించుకునేందుకు అనుమతినివ్వాలని కోరేవారు పెరగటంతో అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.
కరోనా అనంతరం యానాంలో మోగుతున్న పెళ్లి బాజాలు - yanam latest news update
కరోనా అనంతరం వివాహ శుభకార్యాలు జరుపుకునేందుకు అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం తూర్పుగోదావరి జిల్లా యానాంలో కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి.
కరోనా నియంత్రణకు అనుసరించవలసిన ప్రమాణాలు పాటిస్తూ.. పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులు హాజరయ్యేలా ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వారం రోజుల్లోనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వందకుపైగా శుభకార్యాలు జరుపుకునేందుకు అవకాశం కలిగింది. దీంతో కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా హాజరయ్యే బంధుమిత్రుల సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంటుందని వధూవరుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
ఇవీ చూడండి...తంటికొండ ప్రమాదంపై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి