ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తునిలో 3 పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన అధికారులు

తుని పట్టణంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్​డౌన్​ను కట్టుదిట్టం చేశారు. బాధితులు ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడికి తిరిగారని ఆరా తీస్తున్నారు.

officers allerted due to corona positive cases registered at thuni in east godavari
officers allerted due to corona positive cases registered at thuni in east godavari

By

Published : May 2, 2020, 7:07 PM IST

తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో మొట్టమొదటి సారిగా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులంతా పట్టణంలోని పెద్ద వీధి, పండావీధులకు చెందిన వారు అయిన కారణంగా... ఆ ప్రాంతాలను రెడ్​జోన్​గా ప్రకటించారు.

గొల్లప్పరావు సెంటర్ నుంచి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు మార్గాన్ని మూసి వేశారు. లాక్​డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. ఈ ముగ్గురు ఎవరెవరిని కలిశారు... ఎక్కడెక్కడ తిరిగారు అన్నది ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details