తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం సందిపూడికి చెందిన 55 సంవత్సరాల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని తల్లికి అనారోగ్యంగా ఉన్న కారణంగా.. కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. అనంతరం సదరు వ్యక్తి అనారోగ్యం బారిన పడి రామచంద్రపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
అప్రమత్తమైన అధికారులు గ్రామంలో పర్యటించి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పీహెచ్సీ వైద్యాధికారి సుదర్శన బాబు ఆధ్వర్యంలో మృతునితో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న 25 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఆలమూరు మండలంలో ఇప్పటివరకు గుమ్మిలేరు, పెనికేరు, నర్సిపూడి గ్రామంలో కేసులు నమోదు కాగా ప్రస్తుతం సందిపూడిలో కరోనా కేసులు రావడం వైరస్ ప్రభావిత గ్రామాల సంఖ్య నాలుగుకు చేరింది.