తూర్పుగోదావరి జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానిత లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య సిబ్బందికి, యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అలా పరీక్షలకు స్వయంగా వచ్చిన వారికి వారానికి ప్రతీ 1000 మందికి లక్కీడిప్ తీసి అందులో ఐదుగురికి ప్రోత్సాహకం అందిస్తామని జేసీ లక్ష్మీషా అన్నారు. కత్తిపూడిని రెడ్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ర్యాండమ్ సర్వే నిర్వహించి 43 మంది నమూనాలు సేకరించామని చెప్పారు. లక్షణాలు గోప్యంగా ఉంచితే ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవడంతోపాటు.. చుట్టుపక్కల వారికి నష్టం కలుగుతోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. జిల్లాలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.
లక్ష నమూనాల సేకరణే లక్ష్యం