తూర్పుగోదావరి జిల్లాలో చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశాకు చెందిన సుమారు 700 మంది వివిధ పనులు చేసుకునేందుకు రాజమహేంద్రవరంతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాలకు వచ్చారు. కరోనా లాక్‌డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయారు.
తమను స్వస్థలాలకు తరలించాలని అధికారులకు ధరఖాస్తు చేసుకున్నారు. వీరందరినీ పంపించేందుకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానానికి తీసుకొచ్చారు. బస్సుల ద్వారా సుమారు 700 మందిని ఒడిశాకు తరలిస్తామని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, స్వస్థలాలకు పంపిస్తున్నందుకు సంతోషంగా ఉందని వలస కూలీలు చెప్పారు.