ఎన్టీఆర్ జయంతిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. తెదేపా నాయకుడు గన్ని కృష్ణ నివాళి అర్పించారు. పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు, కళ్లజోళ్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి పేదలకు మేలు చేకూర్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని అభిప్రాయపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు - రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ జయంతి
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు.
![తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ntr jayanti in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11935148-179-11935148-1622211629544.jpg)
ntr jayanti in east godavari district
జగ్గంపేటలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. తెదేపా సీనియర్ నాయకులు, ఎస్వి ప్రసాద్.. రాజస్థాన్ నుంచి వలస వచ్చి తిండి లేక ఇబ్బందిపడుతున్న సుమారు 50 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. తెదేపాను స్థాపించిన ఎన్టీఆర్ పేదవారి అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు.
ఇదీ చదవండి:Polavaram: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఏరియల్ సర్వే కోసం నిధులు కేటాయింపు