ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NSG Report on Chandrababu Security: చంద్రబాబు అరెస్టుపై కేంద్ర హోంశాఖకు ఎన్​ఎస్​జీ నివేదిక.. భద్రతా వైఫల్యాలు ప్రస్తావన

NSG Report on Chandrababu Security: చంద్రబాబు నాయుడు అరెస్టు, ఇతర అంశాలపై ఎన్​ఎస్​జీ కేంద్ర హోం శాఖకు నివేదిక పంపింది. ఇందులో పలు కీలక అంశాలకు ఎన్​ఎస్​జీ ప్రస్తావించింది. ప్రస్తుతం ఆయన ఉన్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో భద్రతపై సైతం ఈ నివేదికలో ప్రస్తావించింది.

NSG Report on Chandrababu Security
NSG Report on Chandrababu Security

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 11:54 AM IST

NSG Report on Chandrababu Security: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు (Chandrababu Naidu Arrest) సహా ఇతర పరిణామాలపై కేంద్ర హోమ్ శాఖకు అయన వ్యక్తిగత భద్రతా విభాగం ఎన్​ఎస్​జీ (National Security Guard) కేంద్రానికి నివేదిక పంపింది. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10 తేదీ రాత్రి 1 వరకూ జరిగిన అరెస్టు, ఏసీబీ (Anti Corruption Bureau) కోర్టు రిమాండ్, జైలులో భద్రత తదితర అంశాలను తన నివేదికలో ఎన్​ఎస్​జీ పేర్కొంది.

9వ తేదీ ఉదయం 6 గంటలకు సీఐడీ అరెస్టుతో పాటు ఎన్​ఎస్​జీ (NSG) ప్రొటెక్ట్​గా ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడ తరలింపు అంశాన్ని ఎన్​ఎస్​జీ ప్రస్తావించింది. 10వ తేదీ తెల్లవారుజాము 3.30 గంటల నుంచి సిట్ కార్యాలయం.. విజయవాడ జీజీహెచ్, ఏసీబీ కోర్టుకు తరలించినట్లు పేర్కొంది.

Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్​.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు

ఆ రోజు మొత్తం భద్రతా పరంగా (Chandrababu Naidu Security) అంతగా పటిష్టంగా లేని కోర్టు హాల్ వెలుపల ఆయన్ను ఉంచినట్టు ఎన్​ఎస్​జీ (Security Lapses During Chandrababu Arrest) తెలిపింది. అదే రోజు రాత్రి 9.29 నిముషాలకు వర్షంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారని రిపోర్టులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విభాగం స్పష్టం చేసింది.

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ప్రస్తుతం అయన భద్రత ఏమిటనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. జైలు అవరణలోకి వెళ్లే సమయంలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్టు పేర్కొంది. మొత్తం నివేదికను చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎన్‌ఎస్‌సీ సిబ్బంది.. కేంద్ర హోం శాఖకు, ఎన్​ఎస్​జీ ప్రధాన కార్యాలయానికి పంపారు.

చంద్రబాబు భద్రతపై భయమేస్తోంది..బయటికొస్తుంటే సగభాగం వదిలేసి వస్తున్నట్లనిపించిందని భువనేశ్వరి భావోద్వేగం

భద్రతపై ఆందోళన:అయితే ఇప్పటికే చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్​ఎస్​జీ రిపోర్టు మరింత ఆందోళన కలిగించేలా ఉంది. చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుంచి చంద్రబాబు విషయంలో అనేక చోట్ల భద్రతాపరమైన లోపాలు కనిపించాయి. తాజాగా అవే విషయాలను ఎన్​ఎస్​జీ సైతం తెలిపింది.

ఏసీబీ కోర్టు సైతం స్పష్టం చేసింది:చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. జైలులో తగిన భద్రత కల్పించాలని తెలిపింది. కానీ జైలు వద్ద అలాంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. సౌకర్యాలు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయని తాజాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తెలిపారు. అంతే కాకుండా తాజాగా జైలు సూపరింటెండెంట్‌ ఆకస్మికంగా సెలవు మీద వెళ్లడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

వీటన్నింటి నేపథ్యంలో తాజాగా ఎన్​ఎస్​జీ కేంద్ర హోంశాఖకు రిపోర్టు పంపించడంతో.. దీనిపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయో అన్నది తెలియాల్సి ఉంది.

TDP Leaders Worried about Chandrababu Naidu security: చన్నీళ్లతో స్నానం.. దోమలతో సహవాసం..కమాండోల భద్రత లేదు.. కర్రలతో కాపలా

ABOUT THE AUTHOR

...view details