తూర్పుగోదావరి జిల్లా మండపేట పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌గా నూక దుర్గారాణి, వైస్ ఛైర్మన్గా పిల్లి గణేశ్వరరావు ఎన్నికయ్యారు. వీరితో పాటు 23 మంది వైకాపా కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఏడుగురు తెదేపా సభ్యులు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. నూక దుర్గారాణి ఇది వరకు ఏడవ ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు. జేసీ రాజకుమారి సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం వైకాపా కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులతో కలిసి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
మండపేట పురపాలక సంఘం ఛైర్ పర్సన్‌గా నూక దుర్గారాణి - Mandapeta Municipality Chairperson latest news
తూర్పుగోదావరి జిల్లా మండపేట పురపాలక సంఘం ఛైర్ పర్సన్‌గా నూక దుర్గారాణి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్గా పిల్లి గణేశ్వరరావును ఎంపిక చేశారు.
చైర్ పర్సన్‌గా నూక దుర్గారాణి