కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు తూర్పుగోదావరి జిల్లాలో చేపలు, మాంసం అమ్మకాలను అధికారులు నిషేధించారు. ప్రత్యేకించి ఆదివారం.. మాంసాహార ప్రియులు వీటికోసం గుంపులు గుంపులుగా మార్కెట్లలోకి ఎగబడుతున్నారనే కారణంతో వీటి అమ్మకాలు నిలిపివేశామని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజవర్గంలో, అంబాజీపేట ముక్తేశ్వరంలో వీటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించి.. ఆంక్షలు విధించారు. అమ్మకాలు జరగకుండా బందోబస్తు పెంచారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: మాంసాహార దుకాణాలు మూసివేత - మాంసాహార దుకాణాలు మూసివేత
కరోనా వ్యాప్తి నివారణ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం మాంసం అమ్మకాలను సైతం ఆపివేసింది. ఆదివారం ప్రజలు మాంసం, చేపలు కొనడానికి ఎగబడుతున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
![లాక్డౌన్ ఎఫెక్ట్: మాంసాహార దుకాణాలు మూసివేత non veg markets are closed in east godavari due to lock down affect](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6852010-353-6852010-1587278430018.jpg)
తూర్పుగోదావరిలో మాంసాహార దుకాణాలు మూసివేత
TAGGED:
మాంసాహార దుకాణాలు మూసివేత