కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసింది. ఇందులో భాగంగా యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇవాళ 11మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. వీరిలో పుదుచ్చేరి రాష్ట్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి నామినేషన్ వేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. చివరి అరగంట సమయంలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. గత శుక్రవారం ప్రారంభమై ఈ శుక్రవారం వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో 22 మంది అభ్యర్థులు నామ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. శనివారం నామపత్రాల పరిశీలన, ఆది, సోమవారాల్లో నామపత్రాల ఉపసంహరణ గడువుగా ఎన్నికల నిర్వహణ అధికారి ప్రకటించారు.
యానాం అసెంబ్లీ స్థానానికి ముగిసిన నామినేషన్ల స్వీకరణ - yanam latest news
కేంద్రపాలిత ప్రాంతం యానాం అసెంబ్లీ స్థానానికి నేటితో నామినేషన్ గడువు ముగిసింది. చివరిరోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా... మొత్తం 22 మంది నామపత్రాలు దాఖలు చేశారు.
![యానాం అసెంబ్లీ స్థానానికి ముగిసిన నామినేషన్ల స్వీకరణ nomination process completed for Yanam Assembly seat in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11074960-289-11074960-1616155864827.jpg)
యానాం అసెంబ్లీ స్థానానికి ముగిసిన నామినేషన్ల స్వీకరణ