ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ఏడాది కొత్తలంక దర్గా ఉర్సు ఉత్సవాలు లేనట్టే - ఉర్సు ఉత్సవం

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలోని దర్గా వద్ద ఏటా నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు ఈ ఏడాది పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనా నేపథ్యంలో అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు.

No Ursu festival in Kottalanka Dargah in this year
ఈ ఏడాది కొత్తలంక దర్గా ఉర్సు ఉత్సవాలు లేనట్లే

By

Published : Oct 27, 2020, 4:34 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలోని దర్గా వద్ద ప్రతి సంవత్సరం అక్టోబర్​లో మూడు రోజుల పాటు ఘనంగా ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వేల మంది ముస్లింలు కుటుంబ సభ్యులతో సహా వచ్చి బాబాకు మొక్కులు చెల్లించుకునేవారు. ఈ ఏడాది కూడా ఈనెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది.

ఉత్సవ కమిటీ వేడుకులకు ఏర్పాట్లు చేయక ముందే రెవెన్యూ అధికారులు ఉత్సవాల నిర్వహణకు అనుమతి లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ ఇక్కడికి రావద్దని సూచించారు. ఎటువంటి చిరు వ్యాపారాలనూ అనుమతించబోమన్నారు. ప్రజలు సహకరించాలని కోరుతూ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి: నడిరోడ్డుపై ఆంబోతుల హోరాహోరీ పోరు

ABOUT THE AUTHOR

...view details