తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని ప్రముఖ పర్యాటక స్థలం.. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం. ఇక్కడికి వేసవి కాలంలో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. గతేడాది నుంచి పుదుచ్చేరి ప్రభుత్వం విధించిన కొవిడ్ ఆంక్షలతో వారి రాక పూర్తిగా తగ్గింది. కనీసం స్థానికులు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. గౌతమీ గోదావరి తీరం ఎంతో సుందరంగా విద్యుత్ వెలుగులతో ముస్తాబై స్వాగతిస్తున్నా.. అటు వైపు అడుగులు వేసేవారే లేరు. ఒకరిద్దరు ధైర్యం చేసి వెళ్లినా.. టూరిస్ట్ పోలీస్ బూత్ సిబ్బంది వారిని వెనక్కి పంపేస్తున్నారు. జన సందడి లేక గోదావరి తీరం కళతప్పి కనిపిస్తోంది.
కొవిడ్ నిబంధనలతో బోసిపోయిన యానాం తీరం - Yanam coast latest news
గోదావరి తీరం.. సాయం సంధ్యా సమయం.. చల్లని గాలి.. ఆ వాతావరణాన్ని ఆస్వాదించని వారుండరు. వేసవి తాపానికి పగలంతా ఉక్కపోత, చెమటలతో విసిగిపోయిన జనం.. అలా బయటకు వెళ్లి సేదతీరాలనుకుంటున్నారు. కానీ కరోనా మహమ్మారి భయంతో ఎవరూ బయటకు వెళ్లేందుకు ధైర్యం చేయట్లేదు.
జనాలు లేక ఖాళీగా ఉన్న యానాం తీరం