తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ పర్యటక ప్రాంతమైన యానంలోని గౌతమి గోదావరి తీరప్రాంతం వేసవికాలంలో కళకళలాడుతూ ఉండేది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ఆంక్షలతో ఇంతకాలం ఇక్కడ సేద తీరేందుకు అనుమతి లేకుండా పోయింది.
కరోనా భయంతో గోదావరి తీరంలో కానరాని పర్యటకులు ! - కరోనా భయంతో కానరాని పర్యటకులు !
ఎచటి నుంచి వీచెనో ఈ చల్లని గాలి అంటూ ఒకప్పుడు పాడుకునే వారంతా .. ఎచట నుంచి వచ్చునో కరోనా మహమ్మారి అంటూ ఆందోళనకు గురవుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే పర్యటకులతో నిత్యం రద్దీగా ఉండే గోదావరి తీరం...ఇప్పడు వెలవెలబోతుంది.
కరోనా భయంతో కానరాని గోదావరి తీరంలో పర్యటకులు !
సడలించిన నిబంధనలతో పరిమిత సంఖ్యలో పర్యటకులను అనుమతించాలని అధికారులు నిర్ణయించినా.. కరోనా భయంతో పర్యటకులు గాని..,స్థానికులు గాని గోదావరి తీరానికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆదివారం రోజు పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది.