ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెరిస్తే నష్టపోతాం.. అంతా చక్కబడ్డాకే అమ్మకాలు చేస్తాం'

లాక్ డౌన్ సడలింపుల్లో దేవాలయాలు తెరుచుకుంటున్నా.. వాటి పరిధిలో ఉండే దుకాణాలు మాత్రం తెరుచుకోలేదు. ఒకవేళ తెరచినా.. తాము నష్టపోతామని దుకాణాదారులు అంటున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో.. సాధారణ పరిస్థితి వచ్చే వరకు దుకాణాలు తెరవబోమని వ్యాపారులు తేల్చి చెప్పారు.

east godavari district
'తెరచిన నష్టమే.. కరోనాకు దూరంగ ఉండటనే హాయి'

By

Published : Jun 8, 2020, 3:46 PM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రయోగాత్మక దర్శనాలు ప్రారంభించినా... దుకాణాలు మాత్రం తెరుచుకోలేదు. తాము తీవ్రంగా నష్టపోతామని దుకాణాలు తెరిచి వ్యాపారాలు నిర్వహించడానికి వ్యాపారులు ఆసక్తి చూపలేదు. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని, దేవస్థానం తెరిచినా భక్తులు వచ్చే పరిస్థితి లేదంటున్నారు.

కరోనా వ్యాప్తి చెందుతుండటంతో సాధారణ పరిస్థితి వచ్చే వరకు దుకాణాలు తెరవబోమని అన్నవరం కొండపై వ్యాపారులు తేల్చి చెప్పారు. ఈ కారణంగా.. సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు పూజా సామగ్రి అమ్మకాలకు... దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details