తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని జొన్నలంక ఇసుక రీచ్ కు భవన నిర్మాణదారులు ఇసుక కోసం డబ్బులు గతంలోనే చెల్లించారు. కానీ ఇసుక అందలేదు. ఫలితంగా.. పనులు ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఇలా.. మార్చి 19 తరువాత భవన నిర్మాణ దారులు ఇసుక కోసం ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన వారు నిర్మాణాలు నిలిపేయాల్సి వచ్చింది.
పడవలపై గోదావరి నుంచి ఇసుకను తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి ట్రాక్టర్లలో ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ నిల్వలు లేవు. ఈ కారణంగా.. డబ్బులు కట్టిన వారు రోజూ.. ఇక్కడికి వచ్చి ఖాళీ చేతులతో తిరిగి వెళ్తున్నారు.