తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో దివిస్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జిల్లాలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున పవన్‌కు అనుమతి నిరాకరిస్తున్నామని ఎస్పీ నయీమ్ అస్మీ వెల్లడించారు. ఈ క్రమంలో జనసేనాని పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
పవన్ కల్యాణ్ పర్యటనకు అనుమతి లేదు: ఎస్పీ నయీమ్ అస్మీ - దివీస్ వివాదం వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయన పర్యటనకు అనుమతి లేదని జిల్లా నయీమ్ అస్మీ వెల్లడించారు.
ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. తుని నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న దివిస్ ఫార్మా సంస్థ తమ జీవితాలపై దుష్ప్రభావం చూపుతుందంటూ ఆందోళన చేపడుతున్న స్థానికులకు మద్దతు పలికేందుకు ఈ నెల 9న పవన్ వెళ్లనున్నారు. ఆరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తుని చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులను, ఇటీవల లాఠీఛార్జ్‌లో గాయపడినవారిని పవన్ పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
ఇదీ చదవండి:కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన