కరోనా వైరస్ కారణంగా మూతబడిన ఆర్టీసీ బస్టాండ్లు రెండు నెలల తరువాత ప్రభుత్వ సడలింపులతో మళ్లీ తెరుచుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ వేలాది మంది ప్రయాణికులతో నిత్యం కళకళలాడుతూ ఉండేది. బస్సు సర్వీసులు ప్రారంభించినప్పటికీ ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్సులో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గింది. కొన్ని బస్సుల్లో స్వల్ప సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుండటం బస్టాండ్లు కళ తప్పాయి.
వెల వెలబోతున్న ప్రయాణ ప్రాంగణాలు - east godavari district today news
వేలాది మంది ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడే ఆర్టీసీ బస్టాండ్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. లాక్డౌన్ సడలింపుల అనంతరం బస్సులు రోడ్లెక్కినప్పటికీ అంతంత మాత్రంగానే ప్రయాణికులు ఉండటం ఆర్టీసీ బస్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
వెల వెలబోతున్న ప్రయాణ ప్రాంగణాలు
ఇవీ చూడండి...