తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో వరద ఉద్ధృతి ఐదో రోజూ కొనసాగుతోంది. మండలంలోని ఆరు గ్రామాల్లోని ఇళ్లన్నీ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దేవీపట్నంతో సహా తొయ్యేరు, వీరవరం, పూడిపల్లి, పోశమ్మగండి, అగ్రహారం గ్రామాలు వరదనీటిలో మునిగాయి. ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అందటంలేదని బాధితులు వాపోతున్నారు. పునారావాస కేంద్రాల్లో తమకు ఆహారం లభించటం లేదని వారు అంటున్నారు. అధికారులు వచ్చి చూసి పోతున్నారే తప్పా తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కూడా వరద ఉద్ధృతి ఉంటే ఎస్టీఆర్ఎఫ్ బలగాలతో... బాధితులను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తీసుకొస్తామని ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు.
నడుము లోతు నీళ్లలో జీవనం.. అయినా అందని సాయం - SDRF బలగాలు
వరద బాధితులకు తక్షణ సాయం అందించమని ప్రభుత్వం అధికారులను ఆదేశించినా అది క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. దేవీపట్నం మండలంలోని వరద బాధితులు నడుము లోతు నీళ్లలోనే నివాసముంటున్నారు. అధికారుల నుంచి తమకు సహాయం లభించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వస్తున్నారు, పోతున్నారు... మాకు దిక్కెవరు?