ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల కమిషన్ ఆదేశించినా... కానరాని అధికారులు! - kothapet constituency latest news

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియను చేపట్టాలని.. ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినా, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అధికారులు లేరు.

no officials to taking nominations
నామినేషన్లు స్వీకరణ

By

Published : Jan 25, 2021, 12:28 PM IST

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నామినేషన్లను స్వీకరించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేరు.

మూడు నుంచి నాలుగు గ్రామాలకు సంబంధించిన నామినేషన్లు తీసుకునే విధంగా.. ఒక మేజర్ పంచాయతీని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో స్టేజ్ 1 అధికారులు ఉండి, నామ పత్రాలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ కేంద్రాల్లో ఎప్పటిలాగానే.. పంచాయతీ అధికారులు, సిబ్బంది వారి విధులు నిర్వహించుకున్నారే తప్ప.. నామినేషన్లు స్వీకరించే సిబ్బంది మాత్రం కానరావటం లేదు.

ABOUT THE AUTHOR

...view details