ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖరీఫ్‌ కాలం.. రైతుల్లో అయోమయం! - ఖరీఫ్‌ సీజన్​లో డబ్బులు లేక రైతుల సమస్యలు న్యూస్

రోజులు వారాలవుతున్నాయి.. వారాలు నెలలవుతున్నాయి.. డబ్బులు పడ్డాయన్న మెసేజ్‌ వస్తుందేమోనని ఎదురుచూపులు.. అసలెందుకు జమ కావట్లేదని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు. ఖరీఫ్‌ సీజన్ ముంగిట నిలిచినా.... ప్రభుత్వానికి విక్రయించిన రబీ ధాన్యం సొమ్మే ఇంకా చేతికందలేదని రైతులు దిగులు చెందుతున్నారు.

ఖరీఫ్‌ ముంగిట రైతుల్లో అయోమయం
ఖరీఫ్‌ ముంగిట రైతుల్లో అయోమయం

By

Published : Jun 10, 2021, 9:19 AM IST

ఖరీఫ్‌ ముంగిట రైతుల్లో అయోమయం

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 4 లక్షల 7వేల ఎకరాల్లో వరి పండించారు. 13లక్షల టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వచ్చింది. స్థానిక అవసరాలకు పోనూ 11లక్షల టన్నుల కొనుగోలుకు నిర్ణయించిన ప్రభుత్వం.. రకాన్ని బట్టి ధరలు ప్రకటించింది. ఏప్రిల్ 7న కేంద్రాలు ప్రారంభించినా.. 20వరకూ కొనుగోళ్ల ఊసే లేదు. నాణ్యత లేదనే సాకుతో ఒక్కో బస్తాకు 200 రూపాయల వరకూ తగ్గించి దళారులు రెచ్చిపోయారు.

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8 నాటికి 57వేల 672 మంది రైతుల నుంచి 6.25లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. 44వేల మందికిపైగా ఇంకా సొమ్ము జమ కాలేదు. మే 13 నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. మొత్తంమీద 912.68 కోట్ల బకాయిలు ఉన్నట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి. రబీ సొమ్ములు రాకపోవటంతో ఖరీఫ్‌ సాగుకు ముందడుగు వేయాలో లేదో తెలియని అయోమయంలో రైతులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details