కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అత్యాధునిక.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియం.. స్విమ్మింగ్ పూల్.. క్రీడా ప్రాంగణాలు ఉదయం 5గంటల నుంచి 9గంటల వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు క్రీడా ప్రాంగణాలు కళకళలాడుతూ ఉండేవి. కరోనాతో దెబ్బకు అన్నీ మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గత నాలుగు నెలలుగా ఇవన్నీ మూతపడడంతో క్రీడాకారులతో పాటు స్థానికులు ఏ విధంగా సాధన చేయాలో తోచని పరిస్థితులు ఏర్పడ్డాయి.
విద్యాసంవత్సరం చివరిలో ఆగిపోవడం.. వేసవి కాలంలో కరోనా లాక్ డౌన్ ఆంక్షలతో ప్రభుత్వం గాని ప్రైవేట్ సంస్థలు ఏ స్థాయిలోనూ ఏ రకమైన క్రీడాపోటీలు నిర్వహించకపోవడం... కనీసం ప్రాక్టీస్ చేసుకునేందుకు కూడా అనుమతి లేకపోవడంతో రాష్ట్ర.. జాతీయ.. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఏళ్ళ తరబడి శిక్షణ పొందుతున్న వారంతా తీవ్ర నిరాశ చెందుతున్నారు.. క్రీడాకారుల కోటా ద్వారా ఉద్యోగాలు సంపాదించాలనుకున్న వారి ఆశలు ఇప్పట్లో నెరవేరేనా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
ఆటల్లేవ్... పోటీల్లేవ్..కనీసం కసరత్తులూ లేవ్… - no games no competitions at least no excises too
విద్యార్థులకు శిక్షణనిచ్చి జిల్లా.. రాష్ట్ర.. జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం నిర్మించిన శిక్షణా శిబిరాలు వెలవెల బోతున్నాయి. కరోనా దెబ్బకు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇండోర్ స్టేడియం.. స్విమ్మింగ్ పూల్.. క్రీడా ప్రాంగణాలు మూతబడ్డాయి.
ఆటల్లేవ్... పోటీల్లేవ్..కనీసం కసరత్తులూ లేవ్…
ఇవీ చదవండి: ఇళ్ల స్థలాలను పరిశీలించిన అమలాపురం ఆర్డీవో