ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కట్టడికి ప్రజలు తమవంతు బాధ్యతగా.. నిబంధనలు పాటించాల్సిందే' - అమలాపురంలో కరోనా నిబంధనలు తాజా వార్తలు

కరోనా మహమ్మారి జడలు విప్పి విజృంభిస్తున్నా... ప్రజల్లో ఏమాత్రం మార్పు కానరావడం లేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండటం.. ఆయా సమయాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

no curfew effecte in amalapuram
కరోనా నిబంధనలు పాటించని జనం

By

Published : May 24, 2021, 10:53 AM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జనం కరోనా నిబంధనలు మరిచి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాంసం, చేపల దుకాణాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల దుకాణాలు వద్ద ఒకరినొకరు అంటిపెట్టుకుని దూరం మరిచి బారులు తీరుతున్నారు. అధికారులు, పోలీసులు ఎంత చెబుతున్నా నిర్లక్ష్య ధోరణిని మాత్రం వీడటం లేదు.

కరోనా మహమ్మారి కట్టడికి.. ప్రజలు వ్యక్తిగతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అధికంగా ప్రాణ నష్టం జరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో ఉంటోంది. ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు విధిగా అనుసరించాల్సిందేనని చెబుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details