తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం కొవిడ్ బాధితులు తరలి వస్తూనే ఉన్నారు. 250 పడకల కోవిడ్ ఆసుపత్రి పూర్తిగా నిండిపోయింది. సామర్థ్యానికి మించి రోగులకు సేవలు అందిస్తున్నారు సిబ్బంది. కొత్తగా వచ్చే వారికి పడకలు ఖాళీ లేకపోవడంతో.. పడిగాపులు కాస్తున్నారు. కొందరు బాధితులు వెనక్కి వెళ్లిపోతున్నారు.
రాజమహేంద్రవరంలో పడకల కొరత.. కరోనా బాధితుల పడిగాపులు - రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ సేవలు
తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ కేసులు రోజు రోజూకూ పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో పడకల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. రాజమహేంద్రవరంలోని 250 పడకల కొవిడ్ ఆస్పత్రి పూర్తిగా నిండిపోయింది. కరోనాతో ఆస్పత్రిలో చేరడానికి వచ్చే వారికి నిరీక్షణ తప్పడం లేదు.
no beds to corona patients