ముగిసిన కాకినాడ అవిశ్వాస తీర్మాన ప్రక్రియ..రిజర్వులో ఫలితం - కాకినాడ తాజా రాజకీయ వార్తలు
11:12 October 05
కాకినాడ మేయర్, ఉపమేయర్-1పై ముగిసిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియ
కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ సుంకర పావనిపై కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియ ముగిసినట్లు (no confidence motion against kakinada mayor deputy mayor-1) ప్రొసీడింగ్ అధికారి, జేసీ లక్ష్మీషా ప్రకటించారు. ఫలితాలను రిజర్వులో ఉంచినట్లు ప్రొసీడింగ్ అధికారి తెలిపారు. తీర్మానానికి అనుకూలంగా మొత్తం 36 మంది ఓటు వేశారు. 33 మంది కార్పొరేటర్లు మేయర్‌ను వ్యతిరేకించగా.. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రి కన్నబాబు, ఎంపీ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి తమ ఓటు వినియోగించుకున్నారు.
2017లో కాకినాడ కార్పొరేషన్‌లోని 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేటర్లలో ముగ్గురు మరణించగా, ఒకరు రాజీనామా చేశారు. ప్రస్తుతం 44 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 31 మందిలో 22 మంది, ఇద్దరు భాజపా కార్పొరేటర్లు అసమ్మతితో ఉండగా.. మొత్తం 33 మంది అవిశ్వాసంపై కలెక్టర్‌కు లేఖలు అందజేశారు. ఈ మేరకు ఇవాళ చేపట్టిన అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌లో మేయర్‌కు వ్యతిరేకంగా 36 మంది ఓటు వేశారు.