ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడాదైనా.. జాడలేని నష్టపరిహారం - తూర్పు గోదావరిలో పంటలకు నష్టపరిహారంపై వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో గతేడాది వరదల్లో మునిగిన పంటకు నష్టపరిహాం ఇంకా అందలేదు. మూడు నెలల క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినా.. ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు.

no compensation for flooded crops at east godavari
వరదల్లో మునిగిన అరటి తోట

By

Published : Oct 8, 2020, 8:15 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వచ్చిన గోదావరి వరదలకు కోనసీమలోని లంక గ్రామాల రైతులు నష్టపోయారు. పది మండలాలకు చెందిన 4560 మంది రైతులు 1316 హెక్టార్ల విస్తీర్ణములో ఉద్యాన పంటలు నష్టపోయారు. వీరికి నష్టపరిహారంగా రూ.2.46 కోట్ల నష్ట పరిహారం రావాల్సి ఉంది. మూడు నెలల క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది కానీ నేటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు.

ఈ ఏడాది వచ్చిన వరదలకు లంక రైతులు మళ్లీ నష్టపోయారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం మాత్రం వెంటనే రావడం లేదు. ఇప్పటికైనా గత ఏడాది నష్టపోయిన పంటలకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల జలవివాదం: క్రియాశీలకం కానున్న కృష్ణాబోర్డు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details