గురువారం ఒక్క రోజే కోనసీమ వ్యాప్తంగా 96 కేసులు బయటపడ్డాయి. ముమ్మిడివరం మండలంలో 19, ఆత్రేయపురం మండలంలో 22, రావులపాలెం మండలంలో 28, అమలాపురం మండలంలో 12, కొత్తపేట మండలంలో 10, మామిడికుదురు మండలంలో 2, రాజోలు మండలంలో 3 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో బయటపడుతున్న కేసులతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ సోకకకుండా ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, పోలీసులు సూచిస్తున్నారు.
కోనసీమలో కరోనా ఉగ్రరూపం.. - కోనసీమ నేటి వార్తలు
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. మార్చి 31 నుంచి జూలై 30 వరకు ఈ ప్రాంతంలో 1,663 పాజిటివ్ కేసులు నమోదయినట్లు అమలాపురం డివిజన్ అడిషనల్ డీఎం ఆండ్ హెచ్వో డాక్టర్ పుష్కరరావు తెలిపారు. వీటిలో 1,110 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి.
![కోనసీమలో కరోనా ఉగ్రరూపం.. ninety six new corona positive cases registered in thursday at konaseema east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8238630-481-8238630-1596137850702.jpg)
కోనసీమలో సంజీవని బస్సుల ద్వారా కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్న వైద్యులు