ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనగనగా ఓ చేప... దాని కడుపులో 9 పిల్లలు..! - చేప కడుపులో తొమ్మిది పిల్ల చేపలు వార్తలు

సాధారణంగా చేపలు గుడ్లు పెడతాయని మనకు తెలుసు. అయితే కొన్ని సముద్రపు చేపలు మాత్రం నేరుగా పిల్లల్ని కంటాయని వినడమే తప్పా... ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటిది కూర కోసం తెచ్చిన చేప కడుపులో... ఏకంగా 9 చిన్న చేపలుంటే..? ఏంటీ ఆశ్చర్యపోతున్నారా...? అవునూ... ఈ వింత ఘటనకు వేదికైంది తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం.

Nine cubs in  Shark fish stomach
చేప కడుపులో తొమ్మిది పిల్ల చేపలు

By

Published : Jan 28, 2020, 11:05 PM IST

అనగనగా ఓ చేప... దాని కడుపులో 9 పిల్లలు..!

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ... సముద్రపు చేపను కొనుగోలు చేసింది. కూరకు అన్ని సిద్ధం చేసుకొని చేపను ముక్కలుగా కోసేందుకు సిద్ధమైంది. కత్తితో చేపను కొయ్యగానే.. ఆశ్చర్యపోవడం గృహిణి వంతైంది. చేప కడుపులో ఏకంగా తొమ్మిది చిన్న చేపలున్నాయి. చేప పిల్లలన్ని ఒకే పరిమాణంతో ఆకర్షణీయంగా ఉండడంతో.. వాటిని చూసేందుకు అందరూ ఆసక్తి చూపారు. సాధారణంగా చేపలు గుడ్లు పెడతాయని అందరికి తెలిసినప్పటికీ... కొన్ని జాతులకు చెందిన సొర చేపలు పిల్లల్ని కంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details