అచ్చెన్నాయుడి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. తెదేపాకు మద్దతిస్తున్న అన్ని వర్గాలను అణిచివేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని ఆక్షేపించారు. జగన్ ప్రభుత్వం నిర్ణయాలు సరికాదని 70 సార్లు కోర్టు మొట్టికాయలు వేసిందిని చినరాజప్ప అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టుపైనా కోర్టు స్పందిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
'అచ్చెన్నాయుడు అరెస్టుపైనా కోర్టు స్పందిస్తుంది' - updates on achennaidu arrest
అచ్చెన్నాయుడు అరెస్టుపైనా కోర్టు స్పందిస్తుందని భావిస్తున్నట్లు మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. జగన్ ప్రభుత్వం నిర్ణయాలు సరికాదని 70 సార్లు కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. ఈ విషయంలోనూ అదే జరుగుతుందని ఆయన అన్నారు.
అచ్చెన్నాయుడు అరెస్టుపై చినరాజప్ప
శస్త్ర చికిత్స చేసుకున్న వ్యక్తిని మందులు కూడా వేసుకోకుండా చేశారని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మందితో వెళ్లి అరెస్టు చేయడం సరికాదని.. ప్రభుత్వమే బాధ్యత వహించాలని చినరాజప్ప అన్నారు.
ఇదీ చదవండి:లైవ్ అప్డేట్స్: దేవినేని ఉమ గృహ నిర్బంధం