మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె వివాహం ఈనెల 9న జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నూతన దంపతులు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ముందుగా నిహారిక, చైతన్య దంపతులు సత్యదేవుని వ్రతం ఆచరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. నూతన వధూవరులకు వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని నూతన వధూవరులకు అందజేశారు.
అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న నిహారిక, చైతన్య దంపతులు - అన్నవరంలో నిహారిక దంపతులు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని నిహారిక, చైతన్య దంపతులు దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

niharika chaithanya visit annavaram
అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న నిహారిక, చైతన్య దంపతులు
ఉదయపూర్లో నిహారిక వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యింది.
ఇదీ చదవండి: ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం