పోలవరంలో అదనపు భద్రతా చర్యల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం డంపింగ్ పిటిషన్‌పై ఎన్‌జీటీ రాతపూర్వక ఆదేశాలిచ్చింది. 2016లో పోలవరం విస్తరణకు అదనపు భద్రతా చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. అధ్యయనం, కార్యాచరణ ప్రణాళికకు ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పని చేయనుంది.
పోలవరంలో అదనపు భద్రతా చర్యల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు - polavaram project latest news
పోలవరం డంపింగ్ పిటిషన్‌పై ఎన్‌జీటీ రాతపూర్వక ఆదేశాలు జారీ చేసింది. పోలవరంలో అదనపు భద్రతా చర్యల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది.
ngt on polavaram project
అధ్యయన కమిటీ సభ్యులుగా పర్యావరణ, పీసీబీ, సాయిల్ సంస్థ, ఐఐటీ హైదరాబాద్, దిల్లీ ప్రతినిధులు ఉంటారు. అవసరమైతే కమిటీ ఒక్కసారైనా పోలవరం సందర్శించాలని ఎన్‌జీటీ సూచించింది. వ్యర్థాల డంపింగ్ ప్రాంతాల్లో ప్రభావం, పర్యావరణ నష్టంపై సర్వే చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. పిటిషనర్ పుల్లారావుకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని పీసీబీకి ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: 'ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మళ్లీ ఆశ్రయించవచ్చు'