ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఘనంగా అన్నవరం దేవస్థానంలో జ్వాలా తోరణం

By

Published : Nov 29, 2020, 8:45 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని జ్వాల తోరణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులెవ్వరిని అనుమతించలేదు. వైదిక బృందం, అధికారులతో పూజలు జరిపించారు.

ఘనంగా అన్నవరం దేవస్థానంలో జ్వాలా తోరణం కార్యక్రమం
ఘనంగా అన్నవరం దేవస్థానంలో జ్వాలా తోరణం కార్యక్రమం

కార్తిక పౌర్ణమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో జ్వాలా తోరణం కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తూర్పు రాజ గోపురం వద్ద ఇరువైపుల కర్రలు కట్టి పూజ చేసిన గడ్డి చుట్టి మధ్యలో నిప్పు పెట్టారు. పైన నిప్పు వెలుగుతుండగా స్వామి, అమ్మవార్లను పల్లకిలో మూడు సార్లు తిప్పారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జ్వాలా తోరణం కార్యక్రమం కొండపై నిర్వహించారు. భక్తులను అనుమతించలేదు. కొద్ది మంది వైదిక బృందం, అధికారులతో నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details