తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో ఇర్రిపాక, జగ్గంపేట, మురారి, ఎన్టీ రాజపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇర్రిపాకలో సబ్ స్టేషన్, జగ్గంపేట మెయిన్ రోడ్ బ్రిడ్జిని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఎంపీ వంగా గీత ప్రారంభించారు. గోకవరం వెళ్లే రోడ్ లో సచివాలయానికి శంకుస్థాపన చేశారు.
సబ్ స్టేషన్, బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ - mp vanga geetha
జగ్గంపేట మండలంలో సబ్ స్టేషన్, బ్రిడ్జిలను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఎంపీ వంగా గీత ప్రారంభించారు. గోకవరంలో సచివాలయానికి శంకుస్థాపన చేశారు.
జగ్గంపేట మండలంలో సబ్ స్టేషన్, బ్రిడ్జ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంపీ
పేద ప్రజలకు, రైతులకు, మహిళలకు అన్ని కులాలు, అన్ని వర్గాలకు సీఎం జగన్ భరోసా ఇస్తున్నారని ఏంపీ, ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏడాదిలోనే అన్ని హామీలు అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఇర్రిపాక, మామిడాడ, నరేంద్రపట్నం, మర్రిపాక వంటి గ్రామాలకు విద్యుత్ సమస్యలు తీరతాయని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు.
ఇది చదవండితూర్పు గోదావరి జిల్లాలో వైరస్ ఉద్ధృతి.. ఒక్క రోజులోనే 117 కేసులు!