తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. శనివారం జిల్లా యంత్రాంగం విడుదల చేసిన కొవిడ్19 బులెటిన్లో 117 కేసులు జిల్లా నుంచే నమోదయ్యాయి. ఫలితంగా జిల్లాలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరింది.
తాజాగా.. సామర్లకోటలో 45, కాకినాడలో 18 కేసులు నమోదయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.మల్లికార్జున్ చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకూ 14 మరణాలు నమోదయ్యాయని తెలిపారు. ప్రజలందరూ భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.