తుని మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం నియామకం - New Market Committee news in thuni
తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త కార్యవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ గౌరవ ఛైర్మన్గా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఛైర్మన్గా కొయ్యా మురళీ కృష్ణ, వైస్ ఛైర్మన్గా వంగలపూడి కాంతారావులను నియమించారు.
తూర్పుగోదావరి జిల్లా తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ గౌరవ ఛైర్మన్గా స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఛైర్మన్గా కొయ్యా మురళీ కృష్ణ, వైస్ ఛైర్మన్గా వంగలపూడి కాంతారావులను నియమించారు. సభ్యులుగా కరక నాగరత్నం, జలిమి రజిని, దొడ్డి వరలక్ష్మి, పొల్నాటి ప్రసాదరావు, ఎన్.సూర్యనారాయణ, పిట్ల రామలక్ష్మి, షేక్ క్వాజా మొయినుద్దీన్, నార్ల భువన సుందరి, సోమల కుమారి, అంబుజాలపు బుజ్జి, దాడి అప్పలనాయుడు, కనిగిరి నూక నర్సింహారావు, చక్కా నాగేశ్వరరావులను నియమించారు.